S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతర్‌జిల్లా దొంగల అరెస్టు

వరంగల్, జూలై 29: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను అరెస్టు చేసి వారి నుండి అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సిపి చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామానికి చెందిన బైరి రాములు, వరంగల్ జిల్లా మాదాపురం గ్రామానికి చెందిన శీల యాదగిరి అనే నిందితులు ఇద్దరు కూడా బంధువులే వీరు తాగుడుకు బానిసై, వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో నిందితులు ఇద్దరు చోరీలకు పాల్పడేందుకు వ్యూహాలను రచించి తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడేందుకు పథకం వేశారు. అందులో భాగంగానే తొలిసారిగా 2013 సంవత్సరంలో పాలకుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడి 2014లో దేవరుప్పుల, నల్గొండ జిల్లా ఆలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. 2014 జూలైలో పాలకుర్తి పోలీసులు అరెస్టు చేయగా జైలుకు వెళ్లి తిరిగి బెయిల్‌పై బయటకు వచ్చి నగర పరిధిలోని హన్మకొండ, సుబేదారి, కెయుసి, కాజీపేట, మడికొండ, వర్ధన్నపేట, ఆత్మకూరుతో పాటు వరంగల్ రూరల్ పరిధిలోని జనగామలో మొత్తం పది చోరీలకు పాల్పడ్డారు. నిందితులు ఇద్దరికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో వారు చేసిన బంగారు ఆభరణాలు అమ్మేందుకు గాను శుక్రవారం వరంగల్ ఆర్ ఎన్‌టిలోని బులియన్ మార్కెట్‌కు వచ్చి అనుమానస్పదంగా తిరుగుతుండగా క్రైం ఏసిపి ఈశ్వర్‌రావుకు సమాచారం అందడంతో ఏసిపి ఆదేశాల మేరకు సిసి ఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి నుండి బంగారు ఆభరణాలు గుర్తించి అరెస్టు చేశారు. వారు చేసిన నేరాలను పోలీసుల ముందు అంగీకరించారు. నిందితులను సకాలంలో గుర్తించి సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన క్రైం ఏసిపి ఈశ్వర్‌రావు, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్, ఎస్సై సుమన్, హెడ్‌కానిస్టేబుల్ వీరస్వామి, శివకుమార్‌లకు రివార్డులు ఇస్తున్నట్లు సిపి సుధీర్‌బాబు వెల్లడించారు.