S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గడువు ముంచుకొస్తున్నా కానరాని సౌకర్యాలు

మంగపేట, జూలై 29: రేపటి (ఆదివారం) నుండి గోదావరి అంత్య పుష్కరాలు మొదలుకానున్నాయి. బృహస్పతి సింహరాశి ప్రవేశకాలంనందు గత సంవత్సరం జూలై 14 నుండి పనె్నండు రోజులపాటు గోదావరి మహా పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పనె్నండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలలో భాగంగా జూలై 31 నుండి ఆగష్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ అంత్య పుష్కరాల సందర్బంగా పితృ దేవతలకు, బందువులకు, స్నేహితులకు పిండ ప్రదాన కార్యక్రమాలు, సంకల్ప హారతి, పుణ్య స్నానాలు, పవిత్ర గోదావరి దర్శనం తదితర పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదని పండితులు, పురోహితులు అంటున్నారు.
కానరాని సౌకర్యాలు ...
గోదావరి అంత్య పుష్కరాలకు విచ్చేసే భక్తులకు మంగపేట పుష్కరఘాట్ వద్ద ఎలాంటి సౌకర్యాలు ఇంకా కల్పించలేదు. అంత్య పుష్కరాల సందర్బంగా పుష్కరఘాట్‌కు వచ్చే భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు తదితర ఏర్పాట్లు చేయడం కోసం అధికారగణం ఇంకా ఎటువంటి పనులు చేపట్టలేదు. వరంగల్ జిల్లా మొత్తంలో ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముళ్లకట్ట, మంగపేట మండలంలో మంగపేట వద్ద మొత్తం మూడు పుష్కరఘాట్‌లు ఉన్నాయి.
అయితే ఏటూరూనాగారం మండలంలోని ముళ్ళకట్ట పుష్కరఘాట్ వద్ద నీళ్ళు లేకపోవడం, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద తగిన సౌకర్యాలు లేకపోవడం, రవాణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు మంగపేట పుష్కరఘాట్‌కు మాత్రమే భక్తుల తాకిడి అధికమయింది. కాగా ఈ సంవత్సరం జరగనున్న గోదావరి అంత్య పుష్కరాలకు కూడా జిల్లా నలుమూలల నుండే కాక తెలంగాణలోని పలు జిల్లాల నుండి కూడా భక్తులు మంగపేట పుష్కరఘాట్ వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారగణం ఏమాత్రం ముందుకురాకపోవడాన్ని భక్తులు తప్పుపట్టుతున్నారు.
ఇటీవల వచ్చిన గోదావరి ఉధృతికి మంగపేట పుష్కరఘాట్ కోతకు గురై దెబ్బతింది. పుష్కరఘాట్ మెట్ల మీద గోదావరి వరదల వలన పేరుకుపోయిన మట్టి కుప్పలు కుప్పలుగా ఉంది. గత సంవత్సరం గోదావరి పుష్కరాలలో పుష్కర స్నానం చేయని వారు ఈ అంత్య పుష్కరాలలో స్నానం చేయడానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దెబ్బతిన్న పుష్కరఘాట్‌ను యుధ్దప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన రీతిలో స్పందించకుంటే అంత్య పుష్కరాలలలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
గోదావరి అంత్య పుష్కరాలపై ప్రభుత్వం, అధికారులు తగిన ప్రచారం చేయకపోవడంతో అంత్య పుష్కరాల ప్రాధాన్యత ఎక్కువ మంది ప్రజలకు తెలియడంలేదు. మహా పుష్కరాల సమయంలో చేసిన ప్రచారంలో కనీసం పదవ వంతైనా ప్రచారం చేసుంటే అంత్య పుష్కరాలపై ప్రజలకు అవగాహన ఉండేదని పలువురు అంటున్నారు.