S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐక్యంగా ముందుకు సాగాలి

వినాయక్‌నగర్, జూలై 29: రాష్ట్రంలోని రెడ్డి కులస్తులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, టిటిడి సభ్యుడు అర్కల నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని గోనెరెడ్డి కల్యాణ మంటపంలో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక సమావేశాన్ని ఏర్పాటు చేయగా, అర్కల నర్సారెడ్డి, ఈగ గంగారెడ్డి, ఎడ్ల రాజిరెడ్డిలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అర్కల మాట్లాడుతూ, రెడ్డి కులస్తులంతా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు స్పందిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రెడ్డి, కాపు కులస్తులు 90శాతం నష్టపోతున్నారని, అప్పట్లో జమీందార్లు, పోలీసు పటేళ్లు, పట్వారీలు ఉండేవారని ఆయన గుర్తు చేశారు. అలాంటిది దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70సంవత్సరాల్లో రెడ్డిలు రిజర్వేషన్లు అడిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిపిఎస్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి సంఘ సభ్యులతో కలిసి అర్కల నర్సారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కరుణాకర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి. తిర్మల్‌రెడ్డితో పాటు సభ్యులు పాల్గొన్నారు.