S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కానిస్టేబుళ్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

ఇందూర్, జూలై 29: ఈ నెల 31వ తేదీన ఉదయం 10నుండి 12.30గంటల వరకు నిర్వహించే ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని టిఎస్‌పిఎస్సీ సభ్యుడు టి.వివేక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నందు ఈ రిక్రూట్‌మెంట్ నిర్వాహణపై అధికారుల సమావేశం నిర్వహించి, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో 13,296మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా, ఇందుకోసం జిల్లాలో మొత్తం 47పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,51,083మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. విద్యావంతులైన యువత శక్తి, సామార్థ్యాలను రాష్ట్భ్రావృద్ధికి వినియోగించుకునేందుకై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియలో భాగంగా ఈ రిక్రూట్‌మెంట్ జరుపుతున్నట్లు వివరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పటీష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ పద్దతిలో నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విధానంపై ఇన్విజలేటర్లకు 30వ తేదీన అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఉదయం 9.45నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లతో పాటు బూట్ల(షూ)ను అనుమతించడం జరుగదన్నారు. మాల్‌ప్రాక్టీస్‌కు యత్నించే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాల చుట్టు ఉండే జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని అధికారులకు సూచించారు. పరీక్షా సమావేశంలో ఎలాంటి అవాంతరం తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ పద్మాకర్, ఆర్డీఓ యాదిరెడ్డి, డిఎస్పీ ఆనంద్‌కుమార్, పబ్లిక్ కమిషన్ సెక్షన్ అధికారి కె.రాంమూర్తి పాల్గొన్నారు.