S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీరాంసాగర్‌లోకి వరదనీరు

బాల్కొండ, జూలై 29: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి జూన్ 1నుండి శుక్రవారం నాటికి 30టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతం గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు మిగులు జలాలు తోడుకావడంతో రిజర్వాయర్‌లోకి 55వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని, దీంతో శుక్రవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1072.70అడుగులు 34.32టిఎంసిలకు చేరుకుందన్నారు. గత సంవత్సరం ఇదేరోజు రిజర్వాయర్ నీటిమట్టం 1052.00అడుగులు 7.40టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో పాటు మహాప్రాజెక్టుల మిగులు జలాలతో ప్రాజెక్టు నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.