S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి

ఇందూర్, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మొదటి దశలో 121గ్రామాలకు నీటిని అందించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వాటర్‌గ్రిడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ ఇంజనీర్లు, ఆర్డీఓలు, సంబంధిత మండలాల తహశీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విడతల వారిగా గ్రామాలను ఎంపిక చేసుకుని, అందుకు అనుగుణంగా అన్ని పనులను పూర్తి చేసి నీరందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మొదటగా ఆర్మూర్‌లో ఒక గ్రామం, బాల్కొండలో 5, జక్రాన్‌పల్లిలో 2, కామారెడ్డిలో 5, మాచారెడ్డిలో 2, సదాశివనగర్ మండలంలో 6గ్రామాలలో మొత్తం 21గ్రామాలకు వచ్చే నెల 2నుండి పైపులైన్లు, అవసరమైన చోట ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణానికి, సిసి రోడ్ల కటింగ్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా టీమ్‌లు గ్రామాలకు వెళ్లి గ్రామసభలు నిర్వహించి ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించి మిషన్ భగీరథ ద్వారా ఒనగూరే ప్రయోజనాలపై ప్రజలకు వివరించాలని, తద్వారా పనులు చేపట్టేందుకు సమస్యలు తలెత్తకుండా ఒప్పించాలన్నారు.
అదే విధంగా ఆగస్టు 10నుండి రెండవ విడత 24గ్రామాల్లో పనులు ప్రారంభించి పూర్తిచేసి ఆగస్టు చివరికల్లా మొత్తం 45గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. డిసెంబర్ 31నాటికి మొత్తం 121గ్రామాల అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో ఆర్మూర్‌లో 9గ్రామాలు, కామారెడ్డిలో 12, మాచారెడ్డిలో 7, జక్రాన్‌పల్లిలో 29, బాల్కొండలో 29, ఎస్‌ఎస్.నగర్‌లో 35 గ్రామాలకు నీరు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.