S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాల ప్రాచీన చరిత్రను వెలుగులోకి తెచ్చిన పరబ్రహ్మ శాస్ర్తీ

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ జిల్లాల ప్రాచీన చరిత్రను వెలుగులోకి తీసుకు రావడంలో డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్ర్తీ చేసిన కృషి తర తరాలకు విస్మరించలేనిదని హిమాయత్‌నగర్‌లోని చంద్రంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సంతాప సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఆచార్య కిషన్‌రావు, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ వి సుదర్శన్‌రెడ్డి, నాణాల పరిశోధకులు దేమో రాజారెడ్డి, ఆర్కియాలజీ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్‌ఎస్ రామచంద్రమూర్తి, చిరత్ర కారులు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, దక్కన్ అకాడమీ చైర్మన్ యం వేదకుమార్ తదితరులు ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వారిలో శాత వాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులవి ప్రధాన రాజవంశాలని, వీరికి సంబంధించి ఎన్నో సందేహాలను పరబ్రమ్మ శాస్ర్తీ నివృత్తి చేశారని ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు. శాతవాహనులు తెలుగు వారేనని, వారి తొలి రాజధాని కోటి లింగాల అని నిరూపించడంలో శాస్ర్తీది కీలక పాత్ర అని తెలిపారు. విష్ణుకుండినులు ఇక్కడి వారే అని ఆధారాలతో సహా నిరూపించారని అన్నారు. తెలంగాణ చరిత్ర సజీవంగా ఉన్నంత కాలం దానిని వెలుగులోకి తీసుకు వచ్చిన పరబ్రహ్మ శాస్ర్తీ చిరస్మరణీయులుగా ఉంటారని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అడపా సత్యనారాయణ తెలిపారు. శాస్ర్తీ కృషి అభినందనీయమని వేదకుమార్ అన్నారు.