S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలి

వనస్థలిపురం, జూలై 29: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరీ.. తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పనామ చౌరస్తా వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికీ అధికారంలో ఉండే అర్హత లేదని అన్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో ప్రభుత్వంలో ఉన్నతాధిరులు కుట్రకు పూనుకున్నారని ఆరోపించారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐ విచారణకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి పై ప్రభుత్వానికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్న అందిరిపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. నాయకులు రామకృష్ణ, రమాకాంత్, శివగౌడ్, రాములు పాల్గొన్నారు.
కీసరలో బిజెపి ధర్నా
కీసర: ఎంసెట్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని పదవి నుంచి తక్షణమే తొలగించాలని భాజపా జిల్లా కార్యదర్శి జి.తిరుమల్‌రెడ్డి డిమాండ్ చేసారు. శుక్రవారం భాజపా ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి కీసర చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు. తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షంతోనే ఎంసెట్ పేపర్ లీక్ అయిందని అన్నారు. ఎంసెట్ రాసిన విధ్యార్థుల జీవితాలతో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు ఎ.రాజిరెడ్డి, నాయకులు ఎం.సురేశ్, ఎన్.వెంకట్‌రెడ్డి, నాగేశ్, శ్రీశైలం, బాలరాజు, వెంకటేశ్, ప్రవీణ్, పాపిరెడ్డి, సత్యనారాయణ, మహేందర్, దుర్గేశ్ పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో..
మేడ్చల్: ప్రభుత్వం ఎంసెట్-2 పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మేడ్చల్‌లో ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మండల ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు జి. రమేశ్ మాట్లాడుతూ ఎంసెట్-2 పేపర్ లీకేజీ చేసిన రమణరావు (జెఎన్‌టియు) ఇతర అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని కోరారు.
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రశ్నాపత్రాల క్రయ విక్రయాలను సాగించిన వారిని విద్యార్థులను వారి తల్లితండ్రులను కూడా కఠినంగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. జెఎన్‌టియు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టులు చేసి నిర్భందించడం అన్యాయమని ఆరోపించారు. ఎంసెట్ రాసిన విద్యార్థులకు ప్రభుత్వం తగు న్యాయం చేసి వారిలో నెలకొన్న ఆందోళనలను దూరం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివ, సొఫన్, ప్రశాంత్, భాస్కర్, నర్సింహ్మ, వెంకటేశ్, రమేశ్, పాల్గొన్నారు.
కేసిఆర్ రాజీనామా చేయాలి
పరిగి: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేసిఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని పరిగి డివిజన్ సిపిఎం కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో పరిగి తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణలో అవినీతి అక్రమాలు జరగకుండా చూస్తానన్న కేసిఆర్.. ఇంత పెద్ద అవినీతి అక్రమాలు జరిగి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమైనా ఫాంహౌజ్‌లో టైంపాస్ చేయడం దారుణం అన్నారు. కష్టపడి చదివి ర్యాంక్ సాధించారో వారికి ఎంసెట్-3 నిర్వహిస్తే నష్టం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమేష్, బుగ్గయ్య, రత్నం, రజియా, యాదమ్మ, నందు పాల్గొన్నారు.