S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘నాణ్యత’ పరీక్షల నివేదికలు ఇవ్వాలి

హైదరాబాద్, జూలై 29: జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల నాణ్యత ప్రమాణాలపై థర్డ్ పార్టీ అందజేసిన నివేదికలపై చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులను కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బల్దియా నిధులతో ప్రతి సంవత్సరం వందలాది కోట్ల రూపాయలను వెచ్చించి సిసి, బిటి రోడ్లు, భవనాలు, ఇతర సివిల్ నిర్మాణాలు పెద్ద సంఖ్యలో చేపడుతామని, ఈ పనులను జిహెచ్‌ఎంసి ఇంజనీర్ల పర్యవేక్షణలో జరిగినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలచే ఈ పనుల క్వాలిటీపై థర్డ్ పార్టీ పరీక్షలు కూడా చేపడుతున్నామని వివరించారు. థర్డ్‌పార్టీ చేపట్టిన పరీక్షల నివేదికలపై ఏ విధమైన చర్యలు చేపట్టారని కమిషనర్ ప్రశ్నించారు. నాణ్యత ప్రమాణాలను పాటించని కాంట్రాక్టర్లు, దీనికి బాధ్యులైన ఇంజనీర్లపై ఏ విధమైన చర్యలు చేపట్టారన్న అంశంపై కమిషనర్ మొదటిసారిగా సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంజనీరింగ్ పనిపై ఇరవై నాలుగు గంటల్లోగా థర్డ్ పార్టీ నాణ్యత పరీక్షల నివేదికలు అందజేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో అతిక్రమణలను సహించేది లేదని కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు. థర్ట్‌పార్టీ ద్వారా అందజేసిన నివేదికలకు ఆధారంగా కాంట్రాక్టర్లు, అధికారులకు సంబంధించ సమగ్రమైన నివేదికలు సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.