S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి తల్ల్లీ కూతురు ఆత్మహత్య

కాచిగూడ, జూలై 29: ఓ ఇల్లాలు తన చిన్నారి కూతురితో సహా అపార్ట్‌మెంట్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. కాచిగూడ ఇన్స్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన హనుమయ్య చిన్న కూతురు రేణుక (30)ని 2002 సంవత్సరంలో ఉప్పుగూడ, శివాజినగర్ ప్రాంతానికి చెందిన రంగంపేట రవికి ఇచ్చి వివాహం జరిపించారు. అత్త దమయంతి మరిది బాలు తోటికోడలు హరితలు ఆస్తి కోసం రేణుకను వేదిస్తుండటంతో గతంలో పెద్దలతో పంచాయితీ పెట్టించారు. శివాజీనగర్ రవి ఇంట్లో గొడువలు జరుగుతుండటంతో ఇటివలే రవి బంధువులు ఉంటున్న కుద్బిగూడలో ఓ ఇల్లు కిరాయికి తీసుకుని రేణుక, రవి, కూతురు ఆరాధ్యతో పాటు నివాసిస్తున్నారు. రవి లిబర్టీ వద్దనున్న జ్యూవెల్లరీ షాపులో పనిచేస్తున్నాడు. శుక్రవారం రవి ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లాడు. మనస్తాపానికి గురైన రేణుక తన చిన్నారి కూతురు ఆరాధ్యను తీసుకుని కుద్బిగూడ మెయిన్‌రోడ్డులో ఉన్న 10 అంతస్తుల మీరానికేతన్ ఆపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుంది. ఉదయం 10:15 ప్రాంతంలో కూతురుతో పాటు రేణుక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణలను తెలుసుకున్నారు. తల్లి కూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. రేణుక తండ్రి హనుమయ్య ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.