S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఘట్‌కేసర్, జూలై 29: ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారన్న మనస్తాపం, తల్లిదండ్రుల ఆశయం మేరకు చదువులో రాణించలేక పోతున్నాననే వ్యధతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘట్‌కేసర్ పోలీసుల కథనం ప్రకారం ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలోని వైష్ణవి హాస్టల్‌లో ఉంటూ కృష్ణమూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్న బొమ్మగోని తేజశ్రీ (19) శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదిగమనించిన హాస్టల్ యజమాని స్థానిక పోలీసులకు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం, నల్లగొండ జిల్లాకు చెందిన బొమ్మగాని బాలయ్య కూతురు అని తెలిపారు. గత సంవత్సరం ఏదులాబాద్ గ్రామంలోని కృష్ణమూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఇసిఇలో చేరినట్టు తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడటంతో తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అయితే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. తాను మొదటి నుండి చదువులో వెనుకబడి ఉన్నానని తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినకుండా ఇతరులతో చెప్పించి మరీ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారని, గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నాను కాని ధైర్యం చాలలేదని, తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు, మిత్రులు క్షమించాలని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ ప్రకాష్ తెలిపారు.