S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దళితుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం

వనస్థలిపురం, జూలై 29: దళితులకు వర్గీకరణ అవసరం లేదని, ఐక్యతతో రాజ్యాధికారం సాధిస్తామని జాతీయ మాలల ఐక్య వేదిక గ్రేటర్ హైదరాద్ అధ్యక్షుడు బేర బాలకృష్ణ ధీమ వ్యక్తం చేశారు. వర్గీకరణ వద్దు- రాజ్యాధికారం ముద్దు అంటూ శుక్రవారం ఎల్‌బినగర్ రింగు రోడ్డ్ లోని డా.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వినతిపత్రం సమర్పించారు. రింగు రోడ్డులో ధర్నా నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు దళితుల ఐక్యతను కొల్లగొట్టడానికి వర్గీకరణ పేరుతో చిన్నభిన్నం చేసేందుకు చూస్తున్నారని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం సైతం ఎబిసిడి వర్గీకరణ సాధ్యపడదని తేల్చి చెప్పినా, స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రకుల నాయకుల కుట్రలకు దళితులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మూడు ఎకరాల భూమి దళిలులకు అవసరం లేదని, ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్ చేశారు. దళితులకు రాజ్యాధికారం దక్కకుండా వర్గీకరణ పేరుతో మాల మాదిగ సోదరులను విడగొట్టడానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అగ్రకుల నాయకులు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మాలలకు ప్రభుత్వంలో మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని, హక్కుల సాధన కోసం దళితులు ఏకమయ్యి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌లో మాల, మాదిగ కులస్థులకు సెక్యురిటీ లేకుండా రుణసౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాధికారం దిశగా జాతీయ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక నాయకులు గడ్డం సత్యనారాయణ, మనె్న శ్రీరంగం, సిహెచ్ వివేక్, సూరిబాబు, కడారి పెంటయ్య, సత్తమ్మ, కోదండ మురళీ, కట్ట వెంకటేశ్, నర్సింహ పాల్గొన్నారు.