S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై మహాధర్నా

శంషాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ తుంగలో తొక్కిన కెసిఆర్‌పై ఉద్యమం ఉధృతం చేయాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం శంషాబాద్ పట్టణంలో ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యారంగంలో ముందుకు సాగాలని ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలు ఇచ్చిన కెసిఆర్ ఇప్పుడు బడుగు బలహీన వర్గాల విద్యార్థులనే మోసం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వేల కోట్ల బకాయిలు టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాగితాలకే పరిమితం కావడం దారుణమన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవని శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి చెక్కల ఎల్లయ్య, కాంగ్రెస్ సీనియర్ కార్తీక్‌రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శ్రవణ్‌గౌడ్, జడ్పీటిసి సతీష్, పార్టీ అధ్యక్షుడు వేణుగౌడ్, సర్పంచ్ సిద్దేశ్వర్, నాయకులు కె.నర్సింహ్మాగౌడ్, నందరాజ్ గౌడ్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు శ్రావణ్‌గౌడ్, సిహెచ్ శేఖర్ ముదిరాజ్, వంశీయాదవ్, రాఘవేందర్‌రెడ్డి, సాయి, శ్రీకాంత్, కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.