S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతర్రాష్ట్ర బవారీయా గ్యాంగ్ అరెస్టు

హైదరాబాద్, జూలై 29: దారి మళ్లించి.. దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవారీయా ముఠాను దక్షిణ, ఈస్ట్‌జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. బస్టాప్‌లు, రైల్వేస్టేషన్‌లు, షాపింగ్‌మాల్స్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా మహిళలను టార్గెట్ చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడటంతో పాటు వారి చేతిలో ఉన్న బ్యాగ్‌లను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్ షామిలి జిల్లా జిన్‌జానా తాలుకకు చెందిన బవారీయా గ్యాంగ్‌కు సంబంధించిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. బవారీయా ముఠాలో దాదాపు వంద వరకు గ్యాంగ్‌లు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన సభ్యులు దేశంలోని ప్రధాన నగరాలను కేంద్రాలుగా మార్చుకుని దారి దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, జైపూర్, జబల్‌పూర్ వంటి నగరాల్లో దాదాపు వంద దొంగతనాలు చేసినా పట్టుబడని బవారీయా గ్యాంగ్‌కు సంబంధించిన ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదేళ్లుగా దోపీడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు హైదరాబాద్ నగరానికి చేరుకుని రైల్వేస్టేషన్‌లు, బస్టేషన్‌లకు సమీపంలో ఉన్న లాడ్జింగ్‌లో మకాం వేస్తారు. తరువాత బ్యాచ్‌లుగా విభజించుకుని ముందుగా దోపిడీలకు పాల్పడాల్సిన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోపాల్(45), అశోక్‌కుమార్(24), జగ్దీష్(42) కలిసి గడచిన ఐదు మాసాల్లో పాతబస్తీ ఛత్రినాక పోలీస్టేషన్‌తో పాటు కాచిగూడ రైల్వే పోలీస్టేషన్ పరిధిలో మూడు దారి మళ్లించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చార్మినార్, గోపాల్‌పురం పోలీస్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలకు సంబంధించిన కేసులో వీరు నిందితులు. వీరి నుంచి పోలీసులు 11 గ్రాముల బంగారంతో పాటు 29వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో దక్షిణ మండలం డిసిపి వి.సత్యనారాయణ, టాస్క్ఫోర్సు అదనపు డిసిపి ఎన్.కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నగరంలో జరిగిన పలు చైన్‌స్నాచింగ్‌లకు బవారీయా గ్యాంగ్ ముఠా పాల్పడిందని, వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపామని, పట్టుబడ్డ ముగ్గురిపై పిడి యాక్ట్ విధించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు బవారీయా గ్యాంగ్‌కు సంబంధించి రెండు ముఠాలను సైబరాబాద్‌లో, మరో మూడు ముఠాలను హైదరాబాద్‌లో పట్టుకున్నామని చెప్పారు. సమావేశంలో చార్మినార్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి, ఈస్టు జోన్ టాస్క్ఫోర్సు ఇన్‌స్పెక్టర్ సిహెచ్ శ్రీ్ధర్ పాల్గొన్నారు.