S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోకి సినారె సాహిత్యం చేరాలి

హైదరాబాద్, జూలై 29: పద్మభూషణ్ డా. సి.నారాయణరెడ్డి సాహిత్యం కేవలం నగరవాసులకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చదవడానికి వీలుగా సినారె సాహిత్యాన్ని గ్రామాలకు చేరే విధంగా తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కెవి రమణాచారి, డా. శ్రీనివాస్ ఆళ్ళ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు సూచించారు. సినారె రాసిన తొలిపాటలోనే ‘నన్ను దోచుకుందువటె వనె్నల దొరసాని...’ అంటూ తెలంగాణ పదాలు వాడారని అన్నారు. పురాణాలు గుర్తు చేస్తూ ఆనాడే యక్షుడు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు సమాదానం గుర్తు చేశారు. ‘తెలుగు జాతి మనది...’ ప్రాంతాలు వేరైనా తెలుగు వాళ్ళమంతా ఒక్కటే. భవిష్యత్తును ఊహించి 40 సం.ల క్రితమే సినారె పాట వ్రాసారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు పట్టం కడుతూ వుంటే తెలుగు నేలపై ఆదరణ తక్కువుగా ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలకు అమెరికా నుండి వచ్చి పాల్గొనడం భారతదేశ సాంస్కృతిక రాజధాని హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సినారె రాసిన ‘నా రణం మరణంపైన’ అనే గ్రంథాన్ని విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సినారె 86వ జన్మదినోత్సవంలో భాగంగా విద్యాసాగర్‌రావు సినారె సాహిత్య జీవితాన్ని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన కెవి రమణాచారి మాట్లాడుతూ కుంభావ సరస్వతి సినారె అని అన్నారు. సాహిత్య వనంలో విహరించె సినారె తెలంగాణ పోతనామాత్యుడు అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ పోతన తెలంగాణ వాడే అని గర్వంగా చెప్పిన సినారె అని అన్నారు. ఈనాటికి తెలంగాణలో ఒగ్గు కథలో స్ర్తి పాత్రను పురుషులే వేస్తున్నారని అన్నారు. గ్రంథ తొలి ప్రతిని స్వీకరించిన అమెరికా కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ళ మాట్లాడుతూ నిత్య సాహిత్య కృషీవలుడు సినారె అని అన్నారు. తన సన్మానానికి సమాధానంగా డాక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ తనకు జన్మదినం జరుపుకోవటం ఇష్టంలేదని, నూతన గ్రంథావిష్కరణ దినమే జన్మదినంగా భావిస్తానని అన్నారు. నా జీవితం సాహిత్యానికే ‘మరణం నను వరించి వస్తే జోలపాట పాడి పడుకుంటాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో శారద ఆకునూరి, డా. జె.చెన్నయ్య, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సంస్థ వ్యవస్థాపకుడు వంశీ రామరాజు స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ పూర్వ అధ్యక్షురాలు శారద ఆకునూరి తన గానంతో ప్రేక్షకులను అలరించింది.