S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూ.500 కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం:అయ్యన్న

ఏలూరు, జూలై 29 : జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 500 కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. స్థానిక జడ్పీ అతిధిగృహానికి చేరుకున్న అయ్యన్నపాత్రుడుకు శుక్రవారం ఉదయం ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్‌లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 1250 మంది పేదలకు తొలి విడతగా పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో పెండింగ్‌లో వున్న నాలుగు వేల గృహాలతోపాటు కొత్తగా మంజూరైన 18400 గృహాలను ఆగస్టు మొదటి వారంలో పనులు ప్రారంభించి నాలుగు నెలల వ్యవధిలో అన్ని ఇళ్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎ ఎంసి ఛైర్మన్ కురెళ్ల రాంప్రసాద్, మాగంటి సురేంద్రనాధ్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు పాల్గొన్నారు.
గ్రామీణ రహదార్లకు నిధులివ్వాలి: మంత్రి సుజాత
జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.200 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును కోరారు. స్థానిక జడ్పీ అతిధిగృహంలో శుక్రవారం జిల్లా అభివృద్ధిపై మంత్రులు చర్చించారు. గత ఏడాది తుఫాన్ల వలన గ్రామీణ రహదారి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని సుజాత కోరారు. 50 శాతం నిధులు దాతలు భరిస్తే 50 శాతం ఉపాధి హామీ నిధులను మంజూరు చేస్తామని, ఎన్ని వందల కోట్లయనా ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని అయ్యన్నపాత్రుడు చెప్పారు.
కాగా శుక్రవారం వనం -మనం కార్యక్రమం సందర్భంగా స్థానిక సత్రంపాడు జంక్షన్ నుంచి నిర్వహించిన ర్యాలీని మంత్రులు అయ్యన్నపాత్రుడు, సుజాత ప్రారంభించారు. ర్యాలీ అక్కడి నుంచి సి ఆర్ ఆర్ మహిళా కళాశాలకు చేరుకుంది.