S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏలూరు కాలువలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

తాడేపల్లిగూడెం, జులై 29: ఏలూరు కాలువలో ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతైన సంఘటన తాడేపల్లిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న మాకా ఫణికుమార్ (21) రోజూ జిమ్‌కు వెళ్లి అనంతరం ఏలూరు కాలువలో ఈత కొట్టేవాడు. శుక్రవారం కూడా ఇదేవిధంగా ఈత కొడుతుండగా ఒక్కసారిగా ప్రవాహ వేగం పెరగడంతో గల్లంతయ్యాడు. ఆ ప్రాంతంలో ప్రజలు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడుకు చెందిన రిటైర్డు మిలటరీ ఉద్యోగి మాకా శ్రీనివాసరావు కుమారుడు ఫణికుమార్ ఏలూరు కాలువలో గల్లంతైన సంఘటన తెలియడంతో ఉప్పాకపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి మిత్రులు, విద్యార్థులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఫణికుమార్ గల్లంతైన విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, అగ్నిమాపక, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. హుటాహుటిన గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు. కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కొవ్వూరు నుండి 2 వాటర్ బోట్లు ఏలూరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. పట్ణణ సిఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి, ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు.