S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నరసాపురంలో అంత్య పుష్కరాల రన్

నరసాపురం, జూలై 29: గోదావరి అంత్య పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేపట్టినట్లు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన గోదావరి అంత్య పుష్కరాల ట్రయల్ రన్‌లో ఆయన పాల్గొన్నారు. బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ రన్ అమరేశ్వర ఘాట్, వలంధర రేవు, కొండాలమ్మ ఘాట్ వరకు సాగింది. చైర్‌పర్సన్ రత్నమాల సాయి, సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన మహాపుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుచేశామన్నారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి అంత్య పుష్కరాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, ఎంపిపి కనకరాజు, వైస్‌చైర్మన్ నాగబాబు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.