S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అకారణంగా చెట్లు నరికితే క్రిమినల్ కేసులు

తాడేపల్లిగూడెం, జులై 29: అకారణంగా చెట్లు నరికితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. రూరల్ మండలం వెంకట్రామన్నగూడెంలో వనం-మనం కార్యక్రమం శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చెట్లు నరికివేతపై చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. ఆరోగ్యకర వాతావరణం, భావిపౌరుల ప్రయోజనాలు పరిరక్షణే ధ్యేయంగా సిఎం చంద్రబాబు వనం-మనం కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు. ప్రాణవాయువును అందించే చెట్లు తల్లితో సమానమన్నారు. అటవీ విస్తీర్ణం పెంచుకోకపోతే జపాన్ వంటి దేశాల్లో లాగా ఆక్సిజన్ క్లబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. పర్యావరణానికి, ప్రాణకోటికి మేలు చేసే చెట్లను నరకడాన్ని ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో 50 లక్షల మొక్కలు నాటతామన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్ మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సభకు హాజరైన విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఎంఇఒ పాపారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మానుకొండ శాంతమ్మ, ఎంపిటిసి గ్రంథి సుబ్బాయమ్మ, ఎంపిడిఒ వై దోశిరెడ్డి, తహశిల్దారు పి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. స్థానిక జడ్పీహైస్కూలు రోడ్డులో శుక్రవారం పట్టణ సిఐ మూర్తి ఆధ్వర్యంలో మంత్రి మాణిక్యాలరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి కనీసం 25 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. జిల్లాలో ఒక్కరోజులోనే 10 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీ ఐ మధుబాబు, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, వీర్రాజు, ట్రాఫిక్ ఎస్సై సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.