అయ్యో ఆకివీడు
Published Saturday, 30 July 2016ఆకివీడు, జూలై 29: ఆకివీడులో శుక్రవారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. భారీవర్షంతో సంతమార్కెట్, పెద్దింట్లమ్మ అమ్మవారి వీధి, రెడ్డి వీధి, అమృతరావుకాలనీ, కూరగాయల మార్కెట్, చినపల్లివీధి మోకాలు లోతు వర్షపునీటిలో మునిగాయి. అందేవారిబోదె ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ ప్రాంతంలోని బాలికోన్నత పాఠశాలలోకి వర్షపునీరు చొచ్చుకుపోయింది. మోకాలు లోతు వర్షపునీటిలో విద్యార్థులు పాఠశాలకు హజరయ్యారు. ఇటీవల కాలంలో కురిసిన భారీవర్షంగా దీనిని పేర్కొనవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దాటికి ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఎదురైంది. జాతీయ రహదారి సైతం వర్షం నీటితో మునిగింది.