S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కవోని దీక్ష

ఏలూరు, జూలై 29: అంతా పచ్చగా ఉండాలి...్ఫలితంగానే పర్యావరణం మెరుగుపడి కుటుంబాలన్నీ పచ్చగా ఉండేందుకు అవకాశం ఉంటుంది... రాష్ట్రంలో 50శాతం మొక్కలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది... అవిధంగా అన్నీప్రాంతాలు పచ్చగా ఉండేందుకు తనవంతు కృషి ప్రారంభించింది... అంతేకాకుండా దానికి చిన్నపిల్లల దగ్గరనుంచి సంఘాలు, విద్యాసంస్ధలు ఇలా అన్నివర్గాలను భాగస్వాములను చేస్తూ అంతా పచ్చగా ఉండే లక్ష్యాన్ని సాధించేందుకు శుక్రవారం తొలి అడుగు వేసింది. దీనిలోభాగంగా జిల్లాలో ఈ ఒక్కరోజే పదిలక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విశాఖ వంటి ప్రాంతాలతో పోలిస్తే పచ్చగా ఉండాల్సిన పశ్చిమలో కేవలం 18శాతం మాత్రమే పచ్చదనం కన్పిస్తోందని, ఈపరిస్దితి భారీగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్ధానిక అంబికాదేవి ఆలయం నుంచి అన్నివర్గాలను భాగస్వాములను చేస్తూ భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈర్యాలీ నేరుగా వట్లూరులోని సర్ సిఆర్‌ఆర్ మహిళా కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. ఈసందర్భంగా పచ్చటి టోపీలు ధరించిన ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు, ప్రజలు పెద్దఎత్తున మొక్కల పెంపకంపై నినాదాలు చేశారు. దారిపొడవునా పర్యావరణం దెబ్బతింటున్న తీరును, దానికి మొక్కల పెంపకం వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం సిఆర్‌ఆర్ మహిళా కళాశాల ఆవరణలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం జరిగిన భారీ సభలో ఇన్‌ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అయిదుకోట్ల మంది జనాభా ఉన్నారని, వీరిలో ప్రతిఒక్కరూ ఏడాదికి కనీసం తొమ్మిది మొక్కలు నాటితే రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్‌గా మారటం ఖాయమన్నారు. మొత్తం భూభాగంలో 33శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, రాష్ట్రంలో మాత్రం కనీసం 50శాతం పచ్చదనం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని చెప్పారు. ఇటీవల తుపాన్ల ధాటికి దెబ్బతిన్న విశాఖపట్నంలోనే 26శాతం పచ్చదనం ఉందని, అదే పచ్చని పశ్చిమ అని చెప్పుకునే పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం కేవలం 18శాతం మాత్రమే పచ్చదనం ఉందని పేర్కొన్నారు. ఈపరిస్దితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టవ్య్రాప్తంగా శుక్రవారం కోటి మొక్కలు నాటాలని సంకల్పించారని తెలిపారు. పరిశ్రమలు, విద్యాసంస్ధలు, ప్రభుత్వకార్యాలయాలు ఇలా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా అక్కడ మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటంతోపాటు వాటి సంరక్షణకు ఉపాధి హామీ నిధులు అందించాలని కూడా నిర్ణయించారన్నారు. ప్రతి గ్రామంలో స్ధానిక సర్పంచ్, ఇతర పెద్దలు బాధ్యత తీసుకుని మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా 13వేల పంచాయితీలను అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా ప్రతిగ్రామంలో సిమెంటురోడ్లు నిర్మిస్తున్నామని, గత ఏడాది 2000 కోట్ల రూపాయలతో 4500 కిలోమీటర్ల మేర సిమెంట్‌రోడ్లను వేశామని, ఈ ఏడాది మూడువేల కోట్ల రూపాయలతో అయిదువేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అన్నిగ్రామాలకు 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.640 కోట్లు విడుదల చేశామని, దీనికి మరో 640 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులను జోడిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతిగ్రామంలో పంచాయితీ భవనం నిర్మాణానికి 15లక్షల రూపాయలను అందిస్తున్నట్లు చింతకాయల తెలిపారు. రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రాష్టవ్రిభజన జరిగి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వనం-మనం పేరుతో జిల్లాలో పది నుంచి 12లక్షల మొక్కలు నాటుతున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ ప్రకృతితో అనుసంధానం కావాలన్నదే సిఎం చంద్రబాబు మహాసంకల్పమని చెప్పారు. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో 50శాతం ప్రాంతాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దటం లక్ష్యం కావాలని, దీనికోసం ఒకరోజు మొక్కలు నాటడం సరిపోతోందని, ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. అశాస్ర్తియంగా రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను వదిలేశారని, ఇలాంటి సమయంలో సమర్ధుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో 324 కిలోమీటర్ల మేర అన్ని రహదారుల వెంబడి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పధకం కింద ప్రతి కూలీకి 200 మొక్కలను సంరక్షించే బాధ్యత ఇచ్చి నెలకు మూడువేల రూపాయలు భత్యంగా అందించాలని నిర్ణయించామన్నారు. ఈమొక్కలు పెద్దవై ఫలసాయాన్ని ఇస్తే అదికూడా వారే పొందేలా హక్కు కల్పిస్తామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ మొక్కలు నాటే పవిత్రయజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మండలి విప్ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిలో తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా దీర్ఘకాలిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ అవినీతిని దూరం పెట్టి అభివృద్ధిని దగ్గర చేసుకుంటూ పారదర్శకమైన పాలనను ప్రభుత్వం ప్రజలకు అందిస్తోందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బంగారుభవిష్యత్‌ను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు జనరంజకమైన పాలన అందిస్తోందన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా సిఎం పనిచేస్తున్నారన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్ధినీవిద్యార్ధుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. తొలుత కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టరు-2 షరీఫ్, వనం-మనం జిల్లా పరిశీలకులు మిశ్రా, ఎఎంసి ఛైర్మన్లు కురెళ్ల రాంప్రసాద్, మాగంటి సురేంధ్రనాధ్‌చౌదరి, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, డిపిఓ సుధాకర్, అటవీశాఖాధికారులు వినోద్‌కుమార్, నాగేశ్వరరావు, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి, సర్ సిఆర్‌ఆర్ విద్యాసంస్ధల అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు, డాక్టరు వివి బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.