S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వనం-మనంలో 1.40కోట్ల మొక్కలు

కాకినాడ సిటీ, జూలై 29: రాష్ట్రంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా 1.40కోట్ల మొక్కలు నాటనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలోని పోర్టు రైల్వేస్టేషన్ సమీపంలో వనం-మనం పధకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్పలో కలిసి ఆయన పాల్గొన్నారు.జిల్లాలోని రోడ్లు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, వసతి గృహాలలో మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, మున్సిపల్ కమీషనర్ అలీమ్ బాషా, కాకినాడ ఇన్‌ఛార్జి ఆర్‌డిఓ డేవిడ్‌రాజు పాల్గొన్నారు.