S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమన్వయంతో పనిచేయాలి

కాకినాడ సిటీ, జూలై 29: ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతికి రెండు చక్రాల్లా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి మంత్రి ఉమామహేశ్వరావు, డిప్యూటీ సిఎం చినరాజప్ప జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో జిల్లా అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో గోదావరి అంత్యపుష్కరాల నిర్వాహణలో పుష్కర ఘాట్లు తదితర అంశాలపై చర్చించారు. పుష్కర స్నానాలను కేవలం రాజమండ్రిలోని అర్భన్ ఘాట్లు, ఏ గ్రేడు గ్రామీణ ఘాట్‌లలో మాత్రమే ప్రజలను అనుమతించి, బి, సి ఘాట్‌లలో నిషేదం అమలుచేయడం సరికాదని ఈసమావేశాని హాజరయిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తపరిచారు. దీనిపై మంత్రుల ఇద్దరు స్పందిస్తు ప్రజల సౌకర్యాలన దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ఘాట్‌లలో స్థానిక యంత్రాంగంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టి పుష్కర న్నానాలకు ప్రజలను అనుమతించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో నీరు-చెట్టు పధకం పనులు మంజూరులో సబ్‌కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు మద్య సమన్వయం లేని కారణంగా సకాలంలో పనులు ప్రారంభం కాలేదని, వర్షాలు ప్రారంభైన నేటికీ 50శాతం పనులు సైతం చేయలేదని రాజానగరం ఎమ్మేల్యే పెందుర్తి వెంకటేష్ మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి ఉమ మాట్లాడుతూ క్వాలిటీ కంట్రోల్ పేరితో పనులు చేయకపోవడాన్ని జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు అంశంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఇస్తున్న ప్యాకేజీ రేట్లనే జిల్లాలోను అమలుచేయాలని అధికారులకు సూచించారు. అయితే పరిహారం చెల్లింపు విషయంలో దళారులు చొరబడకుండా చూడాలన్నారు. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ద్వారాచేపట్టిన సివిల్ పనులు దాదాపు 28కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న కారణంగా పనులు మద్యలో నిలిచిపోయాయని, ఇంజీనీర్లు సీరియస్‌గా పనిచేయడంలేదని డిప్యూటీ సిఎం రాజప్ప అన్నారు. పుష్కరాలు అనంతరం సెప్టెంబర్ నుండి ప్రతీనెల జిల్లా అధికారులతో సమీక్షలను నిర్వహిస్తామని మంత్రి ఉమ అన్నారు. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వర్మ, జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, దాట్ల బుచ్చిరాజు పాల్గొన్నారు.