S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిహెచ్‌సిలో నిండుగా సిరంజీలు

శంఖవరం, జూలై 29: ఇంజక్షన్ కావాలంటే సూది కొనుక్కోవాల్సిందే శీర్షికన ఈ నెల 27న ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన అధికారులు రోగుల వెతలు తీర్చేందుకు నిండుగా సిరంజీలు సమకూర్చారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రం శంఖవరం గ్రామంలోని ప్రాథమికోన్నత ఆరోగ్య కేంద్రంలో గత కొన్ని రోజులుగా రోగులు తమకు ఇంజక్షన్ చేయించుకోవాలంటే తమ వెంట సిరంజీలు కొనుగోలు చేసి తెచ్చుకోవాలి. లేనిపక్షంలో ఇంజక్షన్ లేనట్లే. దీనితో రోగులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వార్తను ఆంధ్రభూమి వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన మండల వైద్యాధికారి ఎన్ దయానందరావు వెయ్యి సిరంజలు, 500 ఐవి సెట్లు, 50 యాంటీ రాబిస్ వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్టు ఆంధ్రభూమి దృష్టికి తీసుకొచ్చారు.