S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితాంధ్ర ధ్యేయం

పెద్దాపురం, జూలై 29: రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ హరితాంధ్ర (వనం-మనం)లో భాగంగా 67వ వనమహోత్సవం-మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి తోట నరసింహంతో కలిసి యనమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన హరితాంధ్ర ప్రతిజ్ఞను ప్రజాప్రతినిధులతో చేయించారు. అనంతరం మంత్రి యనమల మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి తన వంతుగా ఐదు మొక్కలకు జీవంపోస్తే, సుమారు యాభై కోట్లకు పైగా మొక్కలు పెరిగి రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చగలమన్నారు. మెట్ట ప్రాంతంలో పచ్చదనం తక్కువ స్థాయిలో ఉందన్నారు. సగటున నేలపై 34 శాతం హరితం ఉండాల్సి ఉందని, ప్రస్తుతం 24 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నారు. విరివిగా మొక్కలు పెంచడం ద్వారా ఈ లోటును భర్తీ చేయాలని కోరారు. ఒక్కరోజులో కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో 15లక్షలకు పైగా ఈ రోజున మొక్కలు నాటినట్టు మంత్రి తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని మాట్లాడుతూ పుష్కర కాలువ ద్వారా ఏలేరుకు గోదావరి జలాలలను అందించి రైతుల పంట కష్టాలు తీర్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. వందేళ్ల చరిత్రగల పెద్దాపురం పట్టణాన్ని కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న మంత్రి చినరాజప్ప, మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజులను ఆయన అభినందించారు. కాకినాడ ఎంపి తోట నరసింహం మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, మొక్కలు పెంచడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రతి ఇంటా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. నియోజకవర్గంలో పాండవుల మెట్టపై పార్కు అభివృద్ధికి ఎంపి ల్యాడ్ నుండి 20 లక్షలు, నవోదయ పాఠశాలకు వాహనం కోసం రూ.10 లక్షలు కేటాయించానన్నారు. సభాధ్యక్షుడు హోం మంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సామర్లకోట నుంచి పెద్దాపురం చివరి వరకు డబుల్‌లైన్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు, కొత్తపేట చెరువును బోట్‌క్లబ్‌గా అభివృద్ధి చేసి, చెరువు మధ్యలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చెరువుగట్టుపై రాష్ట్ర ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ద్వారా మరో ట్యాంక్ బండ్‌ను పట్టణంలో నిర్మిస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆసుపత్రుల్లో ప్రసవమైన వారికి ప్రభుత్వం రూ.1,000 సహాయం అందిస్తుందని, ప్రస్తుతం నగుదుతోపాటు ఒక మొక్కను కూడా అందిస్తామన్నారు. తల్లి బిడ్డను సాకినట్టుగా మొక్కను పెంచి పోషించాల్సిన బాధ్యత అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. మున్సిపల్ సెంటర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండు నిర్మాణం పూర్తయిందని, మంచిరోజులు రాగానే బస్టాండు ప్రారంభించి ప్రజలకు అంకితమిస్తామన్నారు. నీరు-చెట్టు పథకంలో భాగంగా కొత్త చెరువును రూ.10లక్షలతో బాగు చేశామని, మరో రూ.85 లక్షలతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. మరిడమ్మ ఆలయం వద్ద గల చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. మొక్కలు పెంచడానికి ఉపాధి పథకంలో ఏడాదికి రూ.750 వంతున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతీ వ్యక్తి, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు వనం-మనంలో భాగస్వాములై విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు. ముందుగా జగ్గంపేట నుంచి వచ్చిన మంత్రులు మెట్టపైగల శతాబ్ది పార్కును సందర్శించారు. పార్కులో ఏర్పాటుచేసిన చిల్డ్రన్ ట్రైన్‌లోప్రయాణించారు. వాటర్ ఫాల్స్‌ను తిలకించారు. అనంతరం బోట్‌క్లబ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. చెరువు చుట్టూ మొక్కలు నాటారు, వనం-మనంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రులు చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల, మహారాణి కళాశాల, ఇతర మున్సిపల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పట్టణంలో ప్లకార్డులు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, దాట్ల బుచ్చిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జిల్లా ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు, ఆర్డీవో విశే్వశ్వరరావు, తహసీల్దార్ వరహాలయ్య, ఎంపిడిఒ వసంత మాధవి, ఇరిగేషన్ ఇఇ జగదీశ్వరరావు, డిఇ కృష్ణారావు, ఫారెస్టు రేంజర్ మురళీకృష్ణ, ఎఎంసి ఛైర్మన్ ముత్యాల రాజబ్బాయి, జడ్పీటీసీ శివనాగరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, అప్పలరాజు పాల్గొన్నారు.