S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘హోదా’ ఉద్యమం ఉద్ధృతం

హిందూపురం, జూలై 29 : విభజన హామీలో భాగంగా ప్రత్యేక హోదా క ల్పించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జెఏసి ని ఏర్పాటు చేసేందుకు వివిధ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థ డెవలప్‌మెంట్ అధికారి నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఇటీవలే కొందరు సామాజిక వేత్త, గాంధేయవాది అన్నా హజారేను కలిసి చర్చించారు. ఈ సందర్భం గా శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నరేంద్రనాథ్ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్న హజారే రాష్ట్రానికి ప్రత్యేక హో దా కల్పించేందుకు పోరాటం చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సమైక్యాంధ్ర సాధనకు, ఎపికి ప్రత్యేక హోదా కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక ఉద్యమనేత చలసాని శ్రీనివాస్‌తో చర్చించి త్వరలోనే జిల్లాలో అన్నా హజారే పర్యటనను ఖరారు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.