S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అర్హులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి

ఉరవకొండ, జూలై 29 : పట్టణంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం రూ.కోట్లు వెచ్చించి దాదాపు 89 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. అయితే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంపిణీ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫలితంగా సంబంధిత భూమిలో కంపచెట్లు పెరిగిపోయాయన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. తాగునీటి పైపులు శిథిలావస్థకు చేరుకోవడంతో నీరు కలుషితం అవుతోందన్నారు. అంతేగాకుండా కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేవలం రాజధాని అమరావతి జపం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. టిడిపి రెండేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. జన్మభూమి కమిటీలకు పూర్తి అధికారాలు ఇచ్చి అధికారులను బొమ్మలుగా మార్చారని విమర్శించారు. ఇకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరించి వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకుంటున్నారన్నారు. అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు దమ్ము ఉంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైకాపాలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించడం లేదన్నారు. ఇక చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. గతంలో చేనేతలకు 600 సబ్సిడీ ఇచ్చేవారని టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం లేదన్నారు. చేనేత రుణామాఫీ కింద రూ.360 కోట్ల నిధులు మంజూరు చేశామని గొప్పలు చెబుతున్నా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇందుకు తహశీల్దార్ బ్రహ్మయ్య స్పందిస్తూ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని, తాగునీటికి కొత్త పైపులైన్లు వేసి శుద్ధనీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ నరసింహులు, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, జడ్పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, ఎంపిటిసి చంద్రమ్మ, ఉపసర్పంచ్ మోహన్, నాయకులు బసవరాజు, ఈరన్న, సుశీలమ్మ, నిరంజన్ గౌడ్, రాము, సోము, వెంకటేశులు, గోవిందు, అశోక్, ఎర్రిస్వామి, సోమశేఖర్, తిరుపాల్ శెట్టి పాల్గొన్నారు.