S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితానంతగా మారుద్దాం

బుక్కరాయసముద్రం, జూలై 29:నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న అనంతను హారితవనంగా మారుద్దామని అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం పంచాయతీ పరిదిలో పోలీసు వసతిగృహాల కోసం కేటాయించిన 95 ఎకరాల స్థలంలో 67వ వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా సుమారు 5వేల చెట్లు నాటే కార్యమ్రాన్ని ఎస్పీ నిర్వహించగా ఈకార్యక్రమానికి శింగనమల ఎమ్యేల్యే ప్రభుత్వ విప్ యామీనిబాల, ఎమ్మెల్సీ శమంతకమణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అందులో బాగంగా ఇక్కడ ఇది వరకే పోలీసుశాఖ తరుపున 3వేల చెట్లను నాటడం జరిగిందన్నారు. ఇప్పుడు 5వేల చెట్లను నాటుతున్నారని అంతే కాకుండా జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిదిలో సుమారు 8లక్షల మొక్కలు నాటడం జరుగుతోందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు మాత్రమే కాకుండా ప్రజలు కూడ చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పోలీసులు విధి నిర్వహణలోనే తీరిక లేని తరుణంలో వారి వంతుగా సామాజిక కార్యక్రమాలలో ముందు వుండి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అదేశాల ప్రకారం అనంతలో ఎక్కువగా చెట్లను నాటి హరితవనంగా మారుద్దాం అప్పుడే అనంతను పట్టి పీడిస్తున్న కరవు తరిమికొడుతుందన్నారు. అనంతరం పోలీసుశాఖ తరుపున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి, ఎస్పి జ్ఞాపికను అందజేశారు.
ఈకార్యక్రమంలో అనంతపురం డిఎస్పీ మల్లికార్జుణవర్మ, డిఎస్పీలు, ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాథ్‌యాదవ్, అనంతపురం వన్‌టౌన్ సిఐ రాఘవన్, బుక్కరాయసముద్రం జడ్పీటిసి రామలింగారెడ్డి, సిద్దరాంపురం గ్రామసర్పంచ్ పి.హనుంతురెడ్డి, బుక్కరాయసముద్రం ఎస్‌ఐ విశ్వనాథ్‌చౌదరి, పలువురు ఎస్‌ఐలు, వందలాది మంది పోలీస్ సిబ్బంది, ఎస్‌ఆర్‌ఐటి కళాశాల విద్యార్థులు, శ్రీషిర్డిసాయి ఇంజినిరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొని చెట్లు నాటే కార్యక్రమంలోవారి వంతుగా చెట్లను నాటారు. ఈకార్యక్రమాన్ని ఇంత విజయంతగా నిర్వహించేందుకు కృషి చేసిన ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ను, బుక్కరాయసముద్రం ఎస్‌ఐ విశ్వనాథ్‌చౌదరిలను ఎస్పీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిఎస్పీలు అభినందించారు.