S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవకోటి మనుగడకు చెట్లే ఆధారం

కణేకల్లు, జూలై 29 : సకల జీవకోటి మనుగడకు చెట్లే ప్రాణవాయువులని మంత్రులు కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం -మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని రచ్చుమర్రి గ్రా మంలో మొక్కలు నాటారు. చీఫ్‌విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ భావితరాల మనుగడ కొనసాగాలంటే విరివిగా మొక్కల పెంచాలన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మార్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టారన్నారు. అదేబాటలో వనం-మనం కార్యక్రమం చేపట్టి ఒకేరోజు కోటి మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పించారన్నారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మొక్కలతోపాటు ఇంకుడు గంతలు తవ్వి ప్రతి నీటి బోట్టునూ ఒడిసి పడుతున్నట్లు తెలిపారు. మన అవసరాలకు చెట్లు నరకడం వల్ల వర్షాలు లేక, పంటలు పండక, వాతావరణం కలుషితమై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలోని 289 పాఠశాలల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 72 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలోనే అతితక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా మొత్తం 10లక్షల 25 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్టవ్య్రాప్తంగా 20 కోట్ల మొక్కలు పెంచాల్సి ఉందన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ రాయదుర్గాన్ని హరితదుర్గంగా మార్చాలనే ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పట్టుదల ఎంతోగానే ఆకర్షించిందన్నారు. ఇందులో మొదటి మొక్క నాటడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒక వ్యక్తి ఏడాదిలో 10 మొక్కలు పైబడి నాటాలనే సంకల్పం పెట్టుకోవాలన్నారు. రాయదుర్గం నియోజకవర్గం చూచి మిగిలిన జిల్లాలు మొక్కలు పెంచడంలో పోటీపడాలన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాఖీ పండగ సందర్భంగా అన్నకు, తమ్ముడికి రాఖి కట్టినట్టుగా ఆడపడుచులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రచ్చుమర్రి గ్రామంలో 32 ఎకరాల్లో దాదాపు 5వేల మొక్కలు నాటడం గర్వగంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్, ట్రైనీ కలెక్టర్ వినోద్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, ఆర్డీఓ రామారావు, తహశీల్దార్ వెంకటశేషు, ఎంపిడిఓ రెహనాబేగం, ఎఓ శ్రీనివాసులు, సిడిపిఓ పార్వతి, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, వైస్ చైర్మన్ వన్నారెడ్డి, ఎంపిపి ఫాతిమాబీ, ఎంపిటిసి ఫకృద్దీన్, టిడిపి కన్వీనర్ లాలెప్ప, సర్పంచు కౌసల్య, ఉపసర్పంచు ఆనంద్ రాజ్, నీటి సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్త, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బసవరాజు, టిడిపి నాయకులు సుదర్శన్, ఆదికేశవనాయుడు, ఈరప్ప, వన్నప్ప పాల్గొన్నారు