S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

1న నీటి పారుదల సలహా మండలి సమావేశం

అనంతపురం, జూలై 29 : నీటి పారుదల సలహా మండలి సమావేశం ఆగస్టు 1న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో చైర్మన్, కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌ఓ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 2016-17 సంవత్సరానికి సంబంధించి టిబిపి హెచ్‌ఎల్‌సి సిస్టం ద్వారా, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సాగునీటి నిర్వహణ, జిల్లాకు సంబంధించి నీటి పారుదల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలను నిమిత్తం 10 టిఎంసిల నీటిని కేటాయించి, మిగిలిన నీటిని ఆయకట్టుకు సరఫరా చేయడం, నీటి ఛౌర్యం, నీటి వృథాను అరికట్టడం, నీటి పారుదల పర్యవేక్షణకు ఇంజినీరు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, నీటి యాజమాన్య ప్రతినిధులతో సంయుక్త బృందాలు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.