S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కేంద్ర మాజీ మంత్రి జైరాం పర్యటనపై రఘువీరా కసరత్తు!

హిందూపురం, జూలై 29 : రాష్ట్ర విభజనతో పూర్తిగా చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సొంత జిల్లా అనంతలో కాంగ్రెస్ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్ ఈనెల 31వ తేదీన మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతం చేసేందుకు రఘువీరా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపి కోటా కింద జైరాం రమేష్ రూ.10 కోట్ల నిధులను మడకశిర, పెనుకొండ, కల్యాణదు ర్గం నియోజకవర్గాలకు మంజూరు చేశారు. దీని వెనుక రఘువీరా కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. గత సార్వత్రిక ఎన్నికల్లో రఘువీరా పెనుకొండ నుంచి పోటీ చేయగా 2009 ఎ న్నికల్లో కల్యాణదుర్గం నుంచి పోటీ చేసిన విషయం విధితమే. అంత కు మునుపు తన సూంత నియోజకవర్గం మడకశిర నుంచి పలుమార్లు విజ యం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గాలకు రూ.10 కోట్ల నిధులను ఎంపి జైరాం రమేష్ కోటా కింద మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో జైరాం రమేష్‌కు అనాదిగా రఘువీరాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయా నిధులను కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ప్రాంతాలకు మంజూరు చేయించి పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదాపై జైరాం రమేష్ సైతం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రసంగం ద్వారా ఒత్తిడి తెచ్చారు. ఇకపోతే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పాదయాత్రను సైతం జిల్లాలో చేయించి రఘువీరా తనదైన ముద్ర వేసుకున్నారు. రైతాంగానికి భాసటగా నిలవడంలో భాగంగా రాహుల్‌గాంధీచే పాదయాత్రను చేయించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఒకింత ఊపు తెచ్చారు. ఏ అవకాశం వచ్చినా ఉదాసీనత లేకుండా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రఘువీరా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న మడకశిర, పెనుకొండ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.