S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తే పోరాటం తప్పదు

విజయనగరం (్ఫర్టు), జూలై 29: ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే విధానాలకు కేంద్రప్రభుత్వం స్వస్తి చెప్పకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయం సంఘం గౌరవాధ్యక్షుడు, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణంరాజు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు బ్యాంకు ఉద్యోగులు సన్నద్ధం కావాలన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా శుక్రవారం ఇక్కడ ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్‌వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలను మనదేశంలో అమలు చేస్తున్నప్పటి నుంచి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడం, వాటిని ప్రైవేటుపరం చేయడం లక్ష్యంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. మొండిబకాయిలు పెరుగుతున్నప్పటికీ పట్టించుకోలేని కేంద్రప్రభుత్వం బ్యాంకుల విలీనాలకు కృషి చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో అన్ని సమస్యలు తొలుగుతాయని ప్రభుత్వం భావిస్తుందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసా మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రయత్నాలను మానుకోవాలన్నారు. అదేవిధంగా ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకులు మురళీ శ్రీనివాస్, ఎస్.శాంతీశ్వరరావు, హరిబాబు, ఇన్సూరేషన్ కార్పోరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి జి.సిద్దార్థ, కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.