S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఘనంగా వనమహోత్సవం

విజయనగరం (్ఫర్టు), జూలై 29: పట్టణంలో వనం-మనంలో భాగంగా శుక్రవారం వనమహోత్సవం ఘనంగా జరిగింది. మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వనమహోత్సవంలో పాల్గొన్నారు. విజ్జీస్టేడియం, మామిడి మార్కెట్‌యార్డులలో జరిగిన వనమహోత్సవంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దఎత్తున సామూహిక వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మొక్కలను నాడటమే కాకుండా సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. వృక్షసంపదతో మానవ మనుగడ ఆధారపడి ఉందని, పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలను పెంచవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో 10వేల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఎంఎం నాయుడు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, జూనియర్ అకౌంట్స్ అధికారి ఆర్‌ఎస్‌ఆర్ కిరణ్, మున్సిపల్ కౌన్సిలర్లు సోము స్రవంతి, కొర్నాన రాజ్యలక్ష్మి, మైలపిల్లి పైడిరాజు, పిన్నింటి కళావతి పాల్గొన్నారు.