S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లా కలెక్టర్‌గా వివేక్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

విజయనగరం, జూలై 29: జిల్లా కలెక్టర్‌గా వివేక్ యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన ఎంఎం నాయక్‌ను విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఇపిడిసిఎల్ సిఎండిగా బదిలీ చేసిన ప్రభుత్వం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వివేక్ యాదవ్‌ను ప్రమోషన్‌పై విజయనగరం కలెక్టర్‌గా నియమించింది. శుక్రవారం ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న వివేక్ యాదవ్ ప్రస్తుత కలెక్టర్ ఎంఎం నాయక్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త కలెక్టర్ వివేక్ యాదవ్‌కు జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, అదనపు జెసి నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, ఆర్‌డిఓ శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రమణమూర్తి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది కొత్త కలెక్టర్‌ను కలుసుకుని అభినందనలు తెలిపారు. కలెక్టర్‌గా చార్జ్ తీసుకున్న అనంతరం వివేక్ యాదవ్ జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న జిల్లామంత్రి డాక్టర్ మృణాళిని, జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి కొత్తకలెక్టర్ వివేక్‌యాదవ్‌కు అభినందనలు తెలిపారు.
అందరి సహకారంతో అభివృద్ధి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక దృష్టి పెడతానని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల సహాయ సహకారాలు తీసుకుంటానని చెప్పారు. గత కలెక్టర్ ఎంఎం నాయక్ అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తూ జిల్లా అభివృద్ధికి అవసరమైన కొత్త కార్యక్రమాలను చేపడతానన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని, ఈ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి కృషిచేస్తానని తెలిపారు.