S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పర్యావరణాన్ని పరిరక్షించండి

విజయనగరం, జూలై 29: వాతావరణ కాలుష్యం భారీగా పెరిగిన కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని జిల్లా ఇన్‌చార్జ్జి, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అసవరం ఏర్పడిందని చెప్పారు. పెద్దఎత్తున మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలంతా మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని కోరారు. వనం-మనంలో భాగంగా విజయనగరం పట్టణ శివారు కొండకరకాం వద్ద ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి రఘునాథరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. సహచర మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్సీలు జగదీష్, శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడుతో కలసి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పల్లె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిన కారణంగా ఆక్సిజన్ శాతం తగ్గి మనిషి జీవితానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు. వాతావరణంలో సమతుల్యత లోపించిన కారణంగా సకాలంలో వర్షాలు కురియకపోవడం, కరవు కారణంగా పంటలు పండకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. వీటన్నింటికి పరిష్కారం భారీగా మొక్కలు పెంచడమన్నారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే వాతవరణంలో కాలుష్యం తగ్గి చక్కని పర్యావరణాన్ని ఏర్పరుచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలలో అదనపు మార్కులు వేయాలనే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని 2029 నాటికి 50శాతం పచ్చదనంతో హరితవనంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ మృణాళిని తెలిపారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 13లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా తీసుకున్నామని, వచ్చే నెల రోజుల్లో 1.90 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామని మంత్రి మృణాళిని తెలిపారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లాను హరితవనంగా మార్చేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. మొక్కలు నాటి పెంచే కార్యక్రమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కేశవరెడ్డి, డిఎఫ్‌ఓలు వేణుగోపాలరావు, రమణమూర్తి, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ స్పెషల్ ఆఫీసర్ యోహన్‌బాబు పాల్గొన్నారు.