S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కలే జీవనాధారం

రామాపురం, జూలై 29: మానవాళికి మొక్కలే జీవనాధారమని లక్కిరెడ్డిపల్లె మార్కెట్‌యార్డు ఛైర్మన్ మద్దిరేవుల రమేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని హసనాపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, తహశీల్దార్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళికి మొక్కలే ఆధారమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందులో భాగంగా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరుగులమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ సహదేవరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని రామాపురం-లక్కిరెడ్డిపల్లె రహదారికి ఇరువైపులా రామాపురం ఎస్‌ఐ జీవన్‌రెడ్డి, సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పది వేల మొక్కలు నాటనున్నామని మొదటిసారిగా రామాపురం- లక్కిరెడ్డిపల్లె రహదారికి ఇరువైపులా మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలి
చక్రాయపేట: ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా మార్చుకోవాలని మండల తహశీల్దార్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గండి కస్తూరిబా పాఠశాల, కొండప్పగారిపల్లె-నెరుసుపల్లె రోడ్డు, చీలేకాంపల్లె రోడ్డు పక్కల ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చాముండేశ్వరి, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఏపీవో గంగరాజు, డిప్యూటీ తహశీల్దార్ రెడ్డన్న, సర్పంచ్ పెద్దరామయ్య, ఏ ఎస్‌వో ప్రతాప్, ఆర్‌ఐ ఇస్మాయిల్, టెక్నికల్ అసిస్టెంట్ రంగారెడ్డి, సుబ్రమణ్యం, టైపిస్టు హనుమంతరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.