S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోటి మొక్కలు నాటాలన్న సిఎం సంకల్పాన్ని జయప్రదం చేయండి

రాజంపేట, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వనం-మనం కార్యక్రమం ద్వారా కోటి మొక్కలు నాటాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, మనమంతా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని విప్ మేడా మల్లికార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ నుండి వనం-మనం ర్యాలీని ప్రారంభించి, డిగ్రీ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థినీ విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటితే ప్రశాంతమైన వాతావరణం ఉండడమే కాకుండా, చల్లదనం, స్వచ్ఛమైన వాయువును అందించి కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. రాజంపేట ప్రాంతం లో ఇప్పటికే 32శాతం అడవుల విస్తీర్ణం ఉందని, దానిని 50శాతానికి పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి పిలుపుమేరకు ఈ రోజు రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా లక్షా 30వేల మొక్కలను నాటడం జరిగిందన్నారు. వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. అనంతరం అత్తిరాల, తాళ్లపాక ఆర్చి వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో మేడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ మాట్లాడుతూ గతంలో మన పూర్వికులు నాటిన వృక్షాల ఫలాలను మనం అనుభవిస్తున్నామన్నారు. నేడు మనం నాటే మొక్కలను జాగ్రత్తగా సంరక్షిస్తే భావితరాలకు ఈ ఫలాలు అందించినవారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్ పిల్లై, డిఎఫ్‌ఓ ఖాదర్‌వల్లీ, డిఎస్పీ రాజేంద్ర, ఎంపిడిఓ హరినాధ్ బాబు, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి, ఎజిపి లక్ష్మీనారాయణ, జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, టిడిపి నేతలు బాపణయ్యనాయుడు, సంజీవరావు, ఉమామహేశ్వరరెడ్డి, ప్రతాప్‌రాజు, సుబ్బరామిరెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు పాల్గొన్నారు.