S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కల పెంపకంలో కడప ఆదర్శంగా నిలవాలి

కడప,జూలై 29: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు నడుంబిగించారని అందులో భాగంగా 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమం ద్వారా జిల్లాలో కోటి మొక్కలు పైబడి నాటి రాష్ట్రంలోనే జిల్లాను రోల్డ్‌మోడల్‌గా నిలపాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆయన వనమహోత్సవంలో భాగంగా నగరంలోని రిమ్స్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లాలో మొక్కలు నాటేందుకు కోటి 6లక్షల మొక్కలు సిద్ధం చేశారని ఆయన గుర్తు చేశారు. మొక్కల పెంపకానికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కలకు జియోట్యాగింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రణాళిక రూపకల్పన చేశారని ఆయన చెప్పారు. వివిధ మహోత్సవాలు, పుట్టిన రోజుల వేడుకలు, పెండ్లిళ్ల వేడుకలు తదితరాలు ఘనంగా చేసుకునే విధంగానే ప్రతి ఒక్కరు వారు నిర్వహించే సంతోష వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచాలని మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు సకాలంలో వర్షాలు కురుస్తాయని వృక్షాలే మనుగడ అని ఆయన గుర్తుచేశారు. జిల్లాలో 5లక్షల 97వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండగా 3లక్షల హెక్టార్లలో ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఎర్రచందనం చెట్లు ఉన్నాయని అటవీ సంపద కాపాడుకుంటూ అడవులను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం శాసన మండలి ఉపాధ్యక్షుడు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భూగర్భజలాలు పెంపొందించేందుకు, పర్యావరణం పరిరక్షించేందుకు పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు కనీసం పదిమొక్కలు నాటాలని, ఎక్కడ మొక్కలు ఉంటే అక్కడ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆయన గుర్తు చేశారు. అలాగే ముఖ్యఅతిధిగా హాజరైన అటవీశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఉదయ్‌కుమార్ ప్రసంగిస్తూ రాష్టవ్య్రాప్తంగా వనమహోత్సవం, పెద్ద ఎత్తున యజ్ఞం తరహాలో మొక్కల పెంపకం జరుగుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలునాటి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల పెంపకానికి నిధుల కొరత లేదని ప్రభుత్వం ఇచ్చిన నిధులే ఖర్చుచేస్తుందన్నారు. జిల్లావారు ఎంతో అదృష్టవంతులని ప్రపంచంలోనే అరుదైన ,విలువైన ఎర్రచందనం జిల్లాలోనే ఉందని ఆయన గుర్తుచేశారు. అలాగే కలెక్టర్ కెవి సత్యనారాయణ ప్రసంగిస్తూ 20రోజుల్లోపు జిల్లాలో కోటి 6లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, మేధావులు, ప్రముఖుల విరివిగా మొక్కలు పెంచేందుకు సామాజిక బాద్యతగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొక్కలపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో గెలుపొందిన 27 మంది విద్యార్థులకు మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. గిరీషా కూచిపూడి నృత్యం ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జెసి శే్వత తెవతియ, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), రాష్ట్ర, జిల్లా టిడిపి నేతలు ఎస్.గోవర్థన్‌రెడ్డి, సిఎం సురేష్‌నాయుడు, బి.హరిప్రసాద్, ఎస్.దుర్గాప్రసాద్, సుభాన్‌బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.