S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్విమ్స్ అంకాలజీ విభాగంలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభించిన చైర్మన్

తిరుపతి, జూలై 29: స్విమ్స్‌లో రూ.7.4 కోట్లతో కొనుగోలుచేసిన నూతన రేడియేషన్ అంకాలజీవార్డు, మెడికల్ అంకాలజీ వార్డు బ్రాకీ థెరఫీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జన్‌కు సంబంధించిన పలు అధునాతన వైద్య పరికరాలను శుక్రవారం టిటిడి చైర్మన్ , ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు ప్రారంభించారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ స్విమ్స్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి కట్టుబడి ఉందన్నారు. బాలజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ ద్వారా లభించే విరాళాలతో పాటు మరింత ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రస్తుతం 30కోట్ల నిధులు ఇస్తున్నామని, ఈ నిధులను 40 నుంచి 70 కోట్లకు పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జె ఇ ఓ శ్రీనివాసరాజు, డైరెక్టర్ పి ఎస్ రవికుమార్, టిటిడి బోర్డుసభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఇతర విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కార్డియాలజి విభాగంలో రక్తనాళాల్లోకి వెళ్లి వాటి పరిస్థితిని అంచనావేసే డాప్లర్ పరికరం న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాల్లో మూర్చవ్యాధిని నిర్థారించుటకు వెనె్నముకలో ఆపరేషన్‌లో ఉపయోగించే వీడియో ఇ ఇ జి పరికరం, అల్ట్రాసోనిక్ బోన్ స్కోల్‌ఫెల్ పరికరం, అంకాలజీలో డాప్లర్ పరికరం, బ్రాకీ థెరఫీ పరకరం, లాప్ట్రో స్కోపీ పరికరాలు, గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చిన్నపిల్లలకు సంబంధించి ప్రేగు ఎండోస్క్ఫో, ల్యాప్రోస్కోపి, శస్తచ్రికిత్సకు ఉపయోగపడే ఆర్గాన్‌ప్లాస్మా కో యాగ్యులేషన్ పరికరం, న్యూరాలజీలోఅల్ట్రా సౌండ్ మిషన్ ద్వారా కిడ్నీస్ స్కానింగ్, కీహోల్ పద్ధతిలో కిడ్నీలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్థారణ తదితర పరికరాలను ప్రారంభించారు.