S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్టీఆర్ జలాశయం గేట్లు ఎత్తివేత

పెనుమూరు, జూలై 29: చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో మండలంలోని కలవగుంట ఎన్టీ ఆర్ జలాశయానికి గురువారం రాత్రి భారీ నీరు వచ్చిచేరింది. శుక్రవారం ఉదయం పది గంటలకు జలాశయంలో నీటిమట్టం 109.8ఎంసి ఎఫిటిలకు చేరింది. కలవగుంట సర్పంచ్ ఆమీన్, పెనుమూరు ఎంపిపి హరిబాబునాయుడు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్శన్ గీర్వాణి శుక్రవారం ఉదయం 11గంటలకు జలాశయాన్ని సందర్శించారు. అనంతరం ఒక గేటు ఎత్తేసారు. ఈసందర్భంగా జడ్పి చైర్‌పర్శన్ గీర్వాణి విలేఖర్లతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 15న ఎన్టీఆర్ జలాశయంలో పూర్తిగా వరదనీరు వచ్చిచేరడంతో ప్రభుత్వం గేట్లు ఎత్తిందన్నారు. ఆ తరువాత భారీ వర్షాలు లేకపోవడంతో ఇటీవల జలాశయం నీటిమట్టం 40 శాతానికి చేరిందన్నారు. అయితే గత 40రోజులుగా చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు నిండిందన్నారు. ఏడు నెలల వ్యవధిలోనే ఎన్టీఆర్ జలాశయం రెండు సార్లు నిండడంతో పరిసర మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసారని తెలిపారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్, ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌డిఒ కోదండరామిరెడ్డి, డిఇ కృష్ణమూర్తి, సుధాకర్ జలాశయాన్ని సందర్శించారు. జలాశయం నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు వదిలే సమయంలో నీవానది పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పెనుమూరు మండలంలో పంట నష్టపరిహారానికి సంబంధిత అధికారులు పర్యవేక్షించి నివేధికలు తయారు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ మునిరత్నం, ఎంపిడిఒ త్యాగరాజుల నాయుడు, ఇరిగేషన్ ఎఇ జయచంద్రనాయుడు, కలవగుంట ఎంపిటిసి అబ్దుల్‌సలామ్, స్థానిక రెవెన్యూశాఖ, మండల అధికారులు పాల్గొన్నారు.