S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుడిపూడిలో గుడిసెల తొలగింపు అడ్డుకున్న పేదలు

సత్తెనపల్లి, జూలై 29: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి నిరుపేదల గెడిసెలను ఉన్నపళంగా పోలీసులను మోహరించి జెసిబితో రెవెన్యూ అధికారులు దగ్గరుండి నిలువ నీడలను కూల్చేస్తుంటే పేదలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలపించారు. మండల పరిదిలోని గుడిపూడి గ్రామంలో గురువారం ఒక్కసారిగా పోలీసు బలగాలు ఆ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చేరుకొనేసరికి ఏమి జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. రంగంలోకి దిగిన జెసిబిలు రెండు గుడెసెలను కూల్చేశాయి, దీనితో ఆ ప్రాంత మంతా యుద్ధవాతావరణం నెలకొంది. ఉన్న పళంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలంటూ పేదలు గగ్గోలు పెట్టినా అధికారులు వినిపించుకోలేదు. అక్కడవున్న 150 ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయమని తహశీల్దార్ ప్రసాద్ హుకూం జారీచేశారు. 30 గుడిసెలను కూల్చేశారు, జెసిబికి ఎదురుగా పేదలు కూర్చోవడంతో మధ్యవర్తుల చర్చలు మొదలై మొత్తం ఆదివారం లోపు ఖాళీ చేస్తే లేఅవుట్ వేసి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని తహశీల్దార్ మధ్యవర్తులకు వివరించారు.