S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలి

అమరావతి, జూలై 29: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి మొక్కలు నాటాలని పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఐదువేల మొక్కలు నాటారు. పర్యావరణ ప్రాముఖ్యత గుర్తించి మొక్కలు నాటాలని విద్యార్థినులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ పీవీడీ లక్ష్మి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలు దెబ్బతినకుండా పోషణ చేయాలని సూచించారు. స్థానిక అమరేశ్వరాలయంలో కూడా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్నాటి కోటయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పెనుముత్సు రామకృష్ణ, ఎండీవో వై రాజగోపాల్, తహశీల్దారు కె నాసరయ్య, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.