S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విత్తన చట్టంలో మార్పులు అవశ్యం

మంగళగిరి, జూలై 29: విత్తన చట్టంలో మార్పులు అవసరమని దేశమంతా ఒకే చట్టం ఉండేవిధంగా కేంద్రప్రభుత్వం చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని మంగళగిరి మండలం నూతక్కిలో ప్రారంభమైన భారతీయ కిసాన్‌సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం అభిప్రాయ పడింది. మూడురోజుల పాటు జరిగే సమావేశాలు శుక్రవారం ప్రారంభ మయ్యాయి. భారతీయ కిసాన్‌సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు బసవీగౌడ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దినేష్ దత్తాత్రేయ కులకర్ణి సమన్వయంలో సమావేశాలు నిర్వహించారు. సంఘ్ అంతర్గత సంస్థాగత విషయాలు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాల సానుకూల, వ్యతిరేక పవనాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో చర్చించారు. ఫసల్ బీమా యోజనలో తెచ్చిన మార్పులు ప్రీమియం 6 నుంచి 2 శాతానికి కుదించడం మొదలైన అంశాలను చర్చించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 48 మంది కార్యవర్గసభ్యులు పాల్గొన్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ ఎపి కార్యదర్శి జి శ్రీకృష్ణకుమార్ తెలిపారు.