S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాగర్ కుడి కాలువకు మంచినీరు విడుదల

విజయపురి సౌత్, జూలై 29: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాలువకు శుక్రవారం సాయంత్రం 6వ గేటు ఎత్తి ప్రాజెక్టు సిఇ వీర్రాజు స్విచ్ ఆన్‌చేసి వేద మంత్రాల మధ్య మంచినీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ సిఇ విలేఖర్లతో మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ మంచినీటి అవసరాలకోసం కృష్ణా బోర్డు 11 టిఎంసిల నీటిని కేటాయించిందన్నారు. కుడి కాలువ ద్వారా 7 టిఎంసిల నీరు విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డు సాగర్ ప్రాజెక్టు అధికారి తెలిపారు. కుడి కాలువ ద్వారా గంటకు 500 క్యూసెక్కులు నీటిని పెంచుతూ అర్థరాత్రికి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో 15 రోజులపాటు 7 టిఎంసిల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల విషయాన్ని ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సమాచారం అందించామన్నారు. ఈ నీటితో రెండు జిల్లాల్లోని కుంటలు, చెరువులు, ట్యాంకులు నింపుకోవాలని తెలిపారు. ఈ నీరు సుమారు మూడు నెలల పాటు నీటి కొరతను తీర్చుతుందని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో నీరు చివరి వరకు చేరే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయన్నారు. ఈ సీజన్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేసి రెండు పంటలకు సాగునీరుతో పాటు మంచినీటి అవసరాలు తీర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో 2010 నుండి కుడికాలువ ఆధునీకరణ పనులలో భాగంగా ప్రధాన కాలువల పనులు పూర్తయ్యాయన్నారు. బ్రాంచి కెనాల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, 2017 మే నాటికి పనులు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కుడికాలువ ప్రా జెక్టు కమిటీ చైర్మన్ భు జంగరాయలు, సాగర్ డ్యాం ఎస్‌ఇ ప్రసాద్, ఇఇ లు జబ్బార్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నరసింహరావు, ఏడుకొండలు, జూనియర్ ఇంజనీ ర్ కేశవరావు, సత్యనారాయణ తదితరులున్నారు.