S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు తీసుకోవాలి

నెల్లూరు, జూలై 29: జిల్లాలో భారీ పరిశ్రమల స్థాపనకు అనేక పారిశ్రామిక సంస్థలు ముందుకు వస్తున్నందున పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థల సేకరణ, వౌలిక సదుపాయాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా యంత్రాంగాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అధికారులు సంబంధిత పరిశ్రమల ప్రతినిధులను సంప్రదించి విధి విధానాలు రూపొందించి వెంటనే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని, వాటిని ప్రభుత్వం పరిశీలించి వెంటనే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో ఎరువులు, పురుగు మందులు తయారుచేయడానికి క్రిబ్‌కో కంపెనీ రూ. 1,800 కోట్లతో పరిశ్రమల స్థాపన, హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ వెయ్యి కోట్లతో పరిశ్రమ, తారకేశ్వర్ టెక్స్‌టైల్స్ పార్కు 337 కోట్లతో, గ్రాబ్‌కో మిషన్ టూల్స్ 260 కోట్లతో పరిశ్రమ, డెల్టా బయోఫార్మా కంపెనీ ద్వారా 44 కోట్లతో మందుల పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు చేయవలసి ఉందని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమల స్థాపన వల్ల 5,156 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జెసి ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొన్ని పరిశ్రమలకు స్థలాలకు కేటాయించామని, కొన్ని పరిశ్రమలకు ప్రత్యామ్నాయ భూమిని పరిశీలించామని, పరిశ్రమల ప్రతినిధులతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో పరిశ్రమల శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి మార్కెండేయులు పాల్గొన్నారు.