S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దుష్టశక్తులు వస్తున్నాయంటూ జనం జాగారం

కావలి, జూలై 29 : మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రాణాలను హరించే దుష్టశక్తులు వస్తున్నాయంటూ కొన్నిరోజులుగా జనం జాగరణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తీర ప్రాంతంలోని ఒక గ్రామంలో కొన్ని నెలల క్రితం వరుస మరణాలు సంభవిస్తుండగా ఒక సాధువు వచ్చి గ్రామంలో ఒక మహా దుష్టశక్తి ఉందని, దాన్ని తరిమేస్తేనే శాంతి జరుగుతుందని చెప్పగా అతన్ని గ్రామస్థులు హేళన చేసి పంపించేశారు. అయితే అతను చెప్పినట్లే పరిస్థితులు ఉండగా, చిరునామా వెతుక్కుంటూ వెళ్లి తీసుకొచ్చి పరిష్కారం చెప్పమని కోరగా ప్రజల ప్రాణాలను, అదీ యుక్తవయస్సులో ఉన్న వారి ప్రాణాలు తీసే ఒక శక్తి గ్రామంలో తిరుగుతుందని చెప్పినట్లు పలువురు చెప్తున్నారు. దానిని తరిమేసేందుకు గ్రామం చుట్టూ గల 9 రామాలయాల గర్భగుడులకు ఎదురుగా నల్లకోడిని బలి ఇచ్చి, నిమ్మకాయలతో పూజలు చేస్తే ఆ శక్తి వెళ్లిపోతుందని చెప్పగా అలా చేసేందుకు సంబంధిత గ్రామస్థులు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తన్నారు. ఈ క్రమంలో కావలి పట్టణానికి తూర్పువైపున గల గ్రామాల రామాలయాల వద్ద బాధిత గ్రామస్థులు నల్లకోళ్లను బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక గ్రామ రామాలయం వద్ద ఆ పని చేయగా సదరు గ్రామస్థులకు ఆరోగ్యాలు సరిగా ఉండటం లేదని అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాంటి కార్యక్రమం జరగకుండా అడ్డుకునే వ్యూహంతో రాత్రిళ్లు నిద్రపోకుండా జాగరణ చేస్తున్నట్లు, వంతుల వారీగా రామాలయాల వద్దే ఉంటున్నట్లు కథనాలు వినవస్తున్నాయి. దీనిపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలను పోగొట్టి ఆందోళనతో ఉన్న జనానికి నమ్మకం కలిగించేలా స్వచ్ఛంధ సంస్థలు, శాస్ర్తియ దృక్పథంతో ముందుకు సాగే సేవా సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.