S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజల పక్షాన పోరాడుతున్నాం

సైదాపురం, జూలై 29: వైకాపా నుండి తాము ప్రధాన పక్షంగా ప్రజల వైపు పోరాడుతున్నామని జడ్పిచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. మండలంలో శుక్రవారం ఆయన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సైదాపురం ఉన్నత పాఠశాల, మండల కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం మర్లపూడి గ్రామంలో జరిగిన గడపగడపకు వైకాపాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ, మహిళకు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చలేదన్నారు. జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చినా స్థానికులకు అవకాశం ఇవ్వలేదన్నారు. నీరు చెట్టు పథకంలో పనులు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులు జరిగిన అవినీతిలో భాగస్వాములు అవుతారని, వారు జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. చెరువు మరమ్మతుల పేరిట తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి నిధులు వెళుతున్నాయని ఆరోపించారు. రెండేళ్లుగా ఒక్క పేదవానికి ఒక్క గృహం ఇచ్చిన పాపాన పోలేదని, వితంతువులకు, వృద్ధులకు పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ శిరీష, ఎంపిపి అంకమ్మ, వసంతలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, ప్రభాకరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.