S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముత్యాలమ్మపాలెం బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు

పరవాడ, జూలై 29: ముత్యాలమ్మపా లెం సముద్ర తీరాన్ని పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం వసుధ ఫార్మా కెమ్ ఔషధ కంపెనీలో ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందితున్న పరవాడ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ముత్యాలమ్మపాలెం సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకం అభివృద్ధి చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఇప్పటికే ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉందన్నారు. అలాగే సినిమా షూటింగ్‌లు అధికంగా జరుగుతున్నారు. దీంట్లో భాగంగానే ముత్యాలమ్మపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంప్రదించి ముత్యాలమ్మపాలెం వెళ్లే రహదారి విస్తరణకు అత్యధిక నిధులను కేటాయించే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే యలమంచలి-గాజువాక రహదారి విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిధులను కేటాయించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి పర్యటన పరవాడ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందన్నారు. దీంట్లో భాగంగా ఈ రెండు కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు, టిడిపి నాయకులు పయిల సన్యాసిరాజు, బుగిడి రామగోవింద్, రొంగలి గోపాలకృష్ణ, అట్టా సన్యాసి అప్పారావు, బొండా సన్నిదేముడు, పయిల బుజ్జి తదితరులు ఉన్నారు.