S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీమలో కుంభవృష్టి

చిత్తూరు/తిరుపతి/కడప, జూలై 29: రుతుపవనాల ప్రభావంతో సీమలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయ. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహించగా సోమల, చౌడేపల్లి మండలాల్లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో జోరుగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతోకూడిన వర్షం కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రోడ్లు మార్గాల్లో అడ్డంగా చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. పూతల పట్టు మండలంలో గొడుగుచింత గ్రామంలో పిడుగు పడి ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో పెనుమూరు మండలంలోని కలవగుంట ఎన్టీఆర్ జలాశయానికి గురువారం రాత్రి భారీ నీరు వచ్చిచేరింది. శుక్రవారం ఉదయం పది గంటలకు జలాశయంలో నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో ఒక గేటుఎత్తి మిగులు జలాలను దిగువకు వదిలారు.కాగా రామచంద్రాపురం మండలంలో శుక్రవారం వేకువజామున కుండపోత వర్షం కురవడంతో వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపునీటికి అనేకమంది రైతుల వరి పొలాలు, వేరుశనగ పంటలు నీట మునిగాయి. ఇదిలావుండగా తిరుమలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. కుంభవృష్టికి రెండో ఘాట్‌రోడ్డులో 8, 14 కిలోమీటర్ల వద్ద మట్టిపెళ్లలు జారిపడ్డాయి. విషయం తెలుసుకున్న ఘాట్‌రోడ్డు సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని మట్టిపెళ్లలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
కడప జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని చెన్నూరు, బద్వేలు, మైదుకూరులో కుంభవృష్టి కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు భారీ వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కుందూ, పాపాగ్ని, పెన్నానదులు వరదనీటితో కళకళలాడుతున్నాయి. చెన్నూరులో 119.4 మిమీ వర్షపాతం నమోదైంది. కడప నగరంలో 92.6 మిమీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.