S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పట్టుకోసం మావోల పోరు

చింతూరు, జూలై 29: మావోయిస్టులు దండ కారణ్య సరిహద్దు ప్రాంతాల్లో పట్టుకోసం పోరాటం సాగిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్ని ఎదురుదాడికి దిగుతుండటంతో ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దండకారణ్య సరిహద్దు ప్రాంతాలైన చింతూరు, వెంకటాపురం, చర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాల్లో విధ్వంసాలు, ఇన్ఫార్మర్ల హత్యలతో మావోయిస్టులు ఆధిక్యాన్ని కొనసాగించేవారు. 2009 నాటికి దేశంలో అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఖమ్మం రికార్డుకెక్కింది. ఈ మండలాల్లో టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు, సెల్ టవర్లు పేల్చివేసి కమ్యూనికేషన్ వ్యవస్థను చాలామేర దెబ్బతీశారు. అలాగే పోలీసు ఇన్‌ఫార్మర్లనే నెపంతో పలువురిని హత్యచేసి హడలెత్తించారు. నిత్యం దండ కారణ్య సరిహద్దులు పోలీసులు, మావోయిస్టుల మధ్య దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లేవి. 2013, ఏప్రిల్ 16న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా పామేరు పోలీసు స్టేషన్ పరిధిలోని కువర్తి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9మంది కెకెడబ్ల్యూ కీలక సభ్యులు మృతిచెందారు. దీంతో రెచ్చిపోయిన మావోయిస్టులు మే 25న సుకుమా జిల్లా దర్భాఘాటు వద్ద కాంగ్రెసు నేతల కాన్వాయ్‌పై మందుపాతరలతో దాడిచేసి, కాల్పులు జరిపి సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, కాంగ్రెసు నేతలు రాజీవ్ శుక్లా, నరేంద్రకుమార్ పాటిల్, దినేష్‌పాటిల్‌ను హత్యచేశారు. మొత్తంగా ఈ దాడుల్లో 27 మంది కాంగ్రెసు నేతలు మృతిచెందగా, 32మంది గాయాలపాలయ్యారు. 2014, మార్చి 11న సుకుమా జిల్లా తుంపాల్-జీలం ఘాట్ మధ్యలో పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడిలో 11మంది సిఆర్‌పిఎఫ్, నలుగురు డిస్ట్రిక్టు ఫోర్సు జవాన్లు, ఒక పౌరుడు మృతిచెందగా ముగ్గురు జవాన్లకు బులెట్ గాయాలయ్యాయి. ఈ దాడులతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టులపై ఎదురుదాడులకు దిగాయి. విభజన అనంతరం మళ్లీ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు వారి వ్యూహాలను సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.
కాగా అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు యాక్షన్ టీంలను రంగంలోకి దించినట్టు సమాచారం. గోదావరి, శబరి పరీవాహక ప్రాంతాల అడుగులకు సమీపంలో లక్ష్యాలను ఎంచుకుని ఈ యాక్షన్ టీంలు తిరుగుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ వారోత్సవాల్లో దండ కారణ్య సరిహద్దు గ్రామాల్లోని యువతను రిక్రూట్‌మెంట్ చేసుకుని, బలాన్ని పెంచుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టులు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చారు. దీంతో దండకారణ్య సరిహద్దులపై పోలీసులు డేగకన్నువేశారు. ఈ వారోత్సవాల్లో మావోయిస్టులు ఎటువంటి విధ్వంసకర, అసాంఘిక కార్యకలాపాలకు, హత్యలకు పాల్పడకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గోదావరి, శబరి తీరాల వెంబడి ఫెర్రీ పాయింట్లపై ఆరా తీస్తున్నారు.